AP Govt: ఏపీటీపీసీ బోర్డు డైరెక్టర్ల నియామకం
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:09 AM
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ బోర్డును ప్రభుత్వం పునర్నిర్మించింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిని చైర్మన్‌గా, ఏపీటీపీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు...
నలుగురు షేర్ హోల్డర్లు కూడా..
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ బోర్డును ప్రభుత్వం పునర్నిర్మించింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిని చైర్మన్‌గా, ఏపీటీపీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు, పరిశ్రమలశాఖ డైరెక్టరు, అడిషనల్ సెక్రటరీ లేదా జాయింట్ సెక్రటరీ, ఎస్టీసీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌లను డైౖరెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఏపీటీపీసీ బోర్డు షేర్‌హోల్డర్స్ (వాటాదారులు)గా ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీలు ఎన్.వి.వీరకుమారి, ఎస్.హనుమంతరావు, అసిస్టెంట్ సెక్రటరీలు ఎస్.శివనాగ రాజేశ్వరి, ఎం.వెంకటేశ్వర్లును నియమించింది. ఇంతకు ముందే పలువురు అధికారులను షేర్‌హోల్డర్స్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ పరిశ్రమలశాఖ మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.