Share News

World Environment Day: పర్యాటక కేంద్రాల్లో పచ్చదనం

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:42 AM

రాష్ట్రంలోని ప్రతి పర్యాటక కేంద్రమూ పచ్చదనంతో నిండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఏపీటీడీసీ కూడా ‘ఒక యూనిట్‌ - ఒక మొక్క - ఒక హరిత బాధ్యత’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని తెలిపారు.

World Environment Day: పర్యాటక కేంద్రాల్లో పచ్చదనం

ఏపీటీడీసీ యూనిట్లలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం

‘ఒక యూనిట్‌-ఒక మొక్క-ఒక హరిత బాధ్యత’ నినాదం

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ బుధవారం ఒక ప్రకటనతో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పర్యాటక కేంద్రమూ పచ్చదనంతో నిండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఏపీటీడీసీ కూడా ‘ఒక యూనిట్‌ - ఒక మొక్క - ఒక హరిత బాధ్యత’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని తెలిపారు. 5వ తేదీన ఏపీటీడీసీ యూనిట్లల్లో మొక్కలు నాటాలని డీవీఎంలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాల శాశ్వత అభివృద్ధికి ఆరోగ్యవంతమైన పర్యావరణం కీలకమన్నారు. ఒక మొక్కను నాటడం ద్వారా భవిష్యత్‌ తరాలకు జీవన యోగ్యమైన ప్రకృతిని అందించగలమన్న భరోసా కలగాలని స్పష్టంచేశారు. ఏపీటీడీసీ యూనిట్లల్లో ప్రతి అధికారి, ఉద్యోగి కచ్చితంగా ఒక మొక్క నాటాలన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 05:42 AM