Anemia Prevention: రక్తహీనత నివారణలో ఏపీ టాప్
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:31 AM
రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. 6 నెలల శిశువు నుంచి యువత, గర్భిణు లు, బాలింతల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికా...
హరియాణా, తెలంగాణలకు తదుపరి స్థానం
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. 6 నెలల శిశువు నుంచి యువత, గర్భిణు లు, బాలింతల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా తీసుకున్న చర్యలతో రాష్ర్టానికి జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రక్తహీనత నియంత్రణకు రాష్ట్ర ప్ర భుత్వాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమీక్షించింది. దీనిలో ఏపీ, హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకు లు లభించాయి. ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి సత్యకుమార్ అభినందించారు.