Share News

AP Government: స్వయం సహాయంలో ఏపీ ఫస్ట్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:50 AM

స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మహిళా సాధికారత, సంఘాలకు రుణాల అందజేయడంలో రోల్‌ మోడల్‌గా మారింది.

 AP Government: స్వయం సహాయంలో ఏపీ ఫస్ట్‌

  • మహిళా సంఘాలకు రుణాలివ్వడంలో అగ్రస్థానం

  • దేశంలోనే అత్యధికంగా రూ.34.83 లక్షల కోట్ల పంపిణీ

  • రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్‌, బిహార్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మహిళా సాధికారత, సంఘాలకు రుణాల అందజేయడంలో రోల్‌ మోడల్‌గా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా సాధికారత, రుణాల అందజేత, వ్యాపారాభివృద్ధి తదితర అంశాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతోంది. మహిళా బృందాల్లోని సభ్యులకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతోపాటు వాటి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. స్వయం సహాయక సంఘాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రూ.34,83,725 కోట్లు అందజేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రూ.1,23,326 కోట్లు అందజేసి ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో, రూ.1,05,132 కోట్లు పంపిణీ చేసి బిహార్‌ మూడోస్థానంలో నిలిచాయి. అలాగే, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించి మహిళా రైతులను ప్రోత్సహించడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ తనదైన ముద్ర వేసింది. 12,97,051 మంది మహిళ లకు చేయూతనిచ్చి మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, 11,37,950 మంది మహిళా రైతులను మద్దతుగా నిలిచి ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. 10,43,085 మంది మహిళా రైతులకు చేయూతనిచ్చి ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది.

Updated Date - Oct 24 , 2025 | 03:50 AM