CEO of NITI Aayog: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:05 AM
తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందుందని నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్ర హ్మణ్యం అన్నారు.
సీఎస్‌తో భేటీలో నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందుందని నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్ర హ్మణ్యం అన్నారు. పూర్వోదయ పథకం, విశాఖపట్నం గ్రోత్ హబ్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో ఆయన గురువారం అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భ ంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పూర్వోదయ పథకం ద్వారా తీరప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగా పోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉం దని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు, వాటిద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తామని చెప్పారు.