Share News

Raksha Bandhan: రాష్ట్రపతికి రాఖీ కట్టిన ఏపీ విద్యార్థులు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:43 AM

రాష్ర్టానికి చెందిన పలువురు విద్యార్థినులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి రాఖీలు కట్టారు.

Raksha Bandhan: రాష్ట్రపతికి రాఖీ కట్టిన ఏపీ విద్యార్థులు

అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టానికి చెందిన పలువురు విద్యార్థినులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి రాఖీలు కట్టారు. దేశవ్యాప్తంగా 720 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనగా రాష్ట్రం నుంచి ఎనిమిది మందికి అవకాశం దక్కింది. బాపట్ల జిల్లాకు చెందిన బి.హేమ, పి.శైలజ, చినగంజాంకు చెందిన డి.కీర్తి, బి.ప్రజ్ఞ, ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థినులు కె.రామతులసి, జి.కృపా, విజయవాడ పటమట విద్యార్థినులు సీహెచ్‌ శ్రావణి, ఎస్‌.రామలక్ష్మి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీచర్లు కేసీహెచ్‌ శాంతమ్మ, షేక్‌ కరీమా, ఎం.పుష్యరాగం విద్యార్థినులకు ఎస్కార్టులుగా వ్యవహరించారు.

Updated Date - Aug 12 , 2025 | 06:43 AM