Polavaram project: పోలవరం తొలి దశకు మరో 5,800 కోట్లివ్వండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:50 AM
పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి ఇంకో రూ.5,800 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖను కోరాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి ఇంకో రూ.5,800 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖను కోరాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన డ్యాం పనులతోపాటు తొలిదశ సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం రూ.5,800 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు రూ.4,800 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. తొలిదశలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల సంఘం ఖరారు చేసింది. ఇందులో ఇప్పటిదాకా రూ.23,658 కోట్లు మంజూరు చేసింది. మరో రూ.6,778.95 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో నుంచి రూ.5,800 కోట్లు ఇవ్వాలని జలవనరుల శాఖ కేంద్రాన్ని కోరనుంది. 29న ఈ మేరకు అభ్యర్థన లేఖ పంపనుంది. నిధుల మంజూరుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.