Andhra Pradesh GST: జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ.2,930 కోట్లు
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:26 AM
రాష్ట్రంలో జూలైలో నికరంగా రూ.2,930 కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది జూలైలో వసూలైన నికర జీఎస్టీ కంటే 12.12 శాతం పెరిగింది.
గతేడాది జూలై కంటే 12.12శాతం ఎక్కువ
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూలైలో నికరంగా రూ.2,930 కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది జూలైలో వసూలైన నికర జీఎస్టీ కంటే 12.12 శాతం పెరిగింది. అంతేగాక 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధిక నెలవారీ నికర వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నికర జీఎస్టీ పెరుగుతూ వస్తోంది. స్థూల జీఎస్టీ వసూళ్లు కూడా గత ఏడాది జూలై కంటే 14 శాతం పెరిగాయి. నెలవారీ వసూళ్లలో పెరుగుదల వేగంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. ఎస్‌జీఎ్‌సటీ వసూళ్లు 14.47 శాతం వృద్ధి చెందాయి. జూలైలో రూ.1,704 కోట్ల ఐజీఎస్టీ వచ్చింది. గత ఏడాది జూలైలో కంటే 10.69 శాతం పెరిగింది.