APPSC Annual Report: గవర్నర్‌కు ఏపీపీఎస్సీ వార్షిక నివేదిక
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:26 AM
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధ, కమిషన్ సభ్యులు మంగళవారం రాజ్‌భవన్‌లో...
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధ, కమిషన్ సభ్యులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. కమిషన్ 2024-25 వార్షిక నివేదికను ఆయనకు అందజేశారు. కాగా, ఏఆర్ అనురాధ గురువారం రిటైర్ కాబోతున్నారు. ఈ ప్రభుత్వంలోనే ఆమె ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.