Kolusu Parthasarathy: మీడియా రిలేషన్స్ పోర్టల్ ప్రారంభం
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:10 AM
రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన అక్రిడిటేషన్లు...
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన అక్రిడిటేషన్లు జారీచేసేందుకు సంబంధించిన మీడియా రిలేషన్స్ పోర్టల్‌ను సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు సచివాలయంలోని ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో వెబ్‌సైట్‌ను సమాచార శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్‌తో కలసి ప్రారంభించారు. గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వివిధ ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా ప్రతినిధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు విధివిధానాలను మంగళవారం తెలియజేస్తామని చెప్పారు.