AP High Court: ఐపీఎస్ విశాల్‌గున్నికేసు విచారణ11కు వాయిదా
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:40 AM
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని...
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గరువారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది జీవీఎల్ మూర్తి స్పందిస్తూ... ‘ప్రస్తుత కేసులో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారు. విచారణను వాయిదా వేయాలి’ అని కోరారు. అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్ కుమార్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను నవంబరు 11కి వాయిదా వేసింది.