Share News

AP Govt: స్టార్ట్‌పలకు భారీ ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:42 AM

కొత్త ఆలోచనా విధానాలు, ఆవిష్కరణలతో ప్రభుత్వ సేవలను వేగవంతం చేయగలిగే సామర్థ్యం ఉన్న స్టార్ట్‌పలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

AP Govt: స్టార్ట్‌పలకు భారీ ప్రోత్సాహం

  • నేరుగా రూ. కోటి దాకా వర్క్‌ ఆర్డర్లు.. ఐటీ శాఖ ఉత్తర్వులు

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కొత్త ఆలోచనా విధానాలు, ఆవిష్కరణలతో ప్రభుత్వ సేవలను వేగవంతం చేయగలిగే సామర్థ్యం ఉన్న స్టార్ట్‌పలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెండరు మార్గదర్శకాలతో నిమిత్తం లేకుండా నేరుగా కోటి రూపాయల వరకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రభుత్వ శాఖలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా స్టార్టప్‌ సంస్థలకు తమిళనాడులో రూ.5 కోట్ల దాకా, కేరళ, కర్ణాటకలో రూ.50 లక్షల దాకా టెండర్‌ ప్రక్రియ లేకుండానే నేరుగా వర్క్‌ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ విధానాన్ని అధ్యయనం చేసిన రాష్ట్ర ఐటీ ఎలకా్ట్రనిక్స్‌ శాఖ ఏపీలో కూడా కోటి రూపాయల దాకా స్టార్ట్‌పలకు నేరుగా వర్క్‌ ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Updated Date - Aug 23 , 2025 | 06:42 AM