AP Govt: రబీ పంటల బీమాకు 44 కోట్లు విడుదల
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:08 AM
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటల బీమాను సకాలంలో అమలుచేయడానికి ప్రభుత్వం....
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటల బీమాను సకాలంలో అమలుచేయడానికి ప్రభుత్వం రూ.44.06 కోట్ల విడుదలకు అనుమతించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఎస్ర్కో ఖాతాలో జమ చేయాల్సిన ముందస్తు ప్రీమియం సబ్సిడీలో 50 శాతానికి ఈ మొత్తం సమానమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, విజయవాడలో మార్కెటింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న వై.శ్రీనివాసరావుకు తాత్కాలిక పదోన్నతి కల్పించి, సెంట్రల్ మార్కెట్ ఫండ్ సర్వీస్ కింద ఉన్న గుంటూరు మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.