Share News

Another DSC In AP: మరో డీఎస్సీకి సన్నద్ధం

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:25 AM

పాఠశాల విద్యాశాఖ మరో డీఎస్సీకి సన్నద్ధమవుతోంది. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి నారా లోకేశ్‌ ఇప్పటికే ప్రకటించారు.

Another DSC In AP: మరో డీఎస్సీకి సన్నద్ధం

  • త్వరలో టెట్‌.. జనవరిలో డీఎస్సీ!

  • సుమారు 2 వేల పోస్టుల భర్తీ

  • ఎన్‌సీటీఈ నిబంధనల అమలు

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ మరో డీఎస్సీకి సన్నద్ధమవుతోంది. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి నారా లోకేశ్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముందుగా టెట్‌ నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేయనుంది. అయితే, ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి టెట్‌కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనలను పాటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలనే అమలు చేయనున్నారు. సుదీర్ఘకాలం నుంచి టెట్‌లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రతిసారీ డీఎస్సీ నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్‌సీటీఈ తరహాలోకి మార్చి, తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరిలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌లో సుమారు 2 వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది. స్పెషల్‌ డీఎస్సీ పోస్టులు వెయ్యి, మెగా డీఎస్సీ-2025లో మిగిలిన పోస్టులు 406, ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారు. ఖాళీలు పెరిగినా విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుంటారు.

Updated Date - Oct 16 , 2025 | 08:10 AM