AP Jaljeevan Mission: రాష్ట్ర జల్‌జీవన్ కార్పొరేషన్ ఏర్పాటు
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం-2013 కింద ఆంధ్రప్రదేశ్ జల్‌జీవన్ వాటర్...
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం-2013 కింద ఆంధ్రప్రదేశ్ జల్‌జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ వైస్ చైర్మన్‌గా, ఆర్థిక, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, జలవనరుల, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు.