ఇన్నోవేషన్ హబ్‌గా ఆంధ్ర: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:31 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శక్తివంతమైన మౌలిక సదుపాయాలతో ఇన్నోవేషన్ హబ్‌ల కేంద్రంగా మారిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్
హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శక్తివంతమైన మౌలిక సదుపాయాలతో ఇన్నోవేషన్ హబ్‌ల కేంద్రంగా మారిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్‌పొజిషన్ ఇండియా 2025 సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగింది. సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, స్టార్ట్‌పలకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.