బలమైన ఆర్థిక పునరుజ్జీవనానికి వేదికగా ఏపీ: లోకేశ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:05 AM
ఏపీ చాలా బలమైన ఆర్థిక పునరుజ్జీవనానికి వేదిక అవుతోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో ఏపీ రూ.3,803 కోట్ల జీఎస్టీ వసూళ్లతో 14ు వృద్ధి నమోదు చేసింది.
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ చాలా బలమైన ఆర్థిక పునరుజ్జీవనానికి వేదిక అవుతోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘ఈ ఏడాది జూలైలో ఏపీ రూ.3,803 కోట్ల జీఎస్టీ వసూళ్లతో 14ు వృద్ధి నమోదు చేసింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నమోదు చేసిన అత్యధిక వసూళ్లు ఇవే. ఈ వృద్ధి దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికం. పెద్ద రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల వృద్ధి శాతంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఏపీ ఈజ్ బ్యాక్... మేము ఇప్పుడే మొదలవుతున్నాం’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.