Andhra Pradesh Cabinet: సొంత ఊర్లో ఐటీ ఉద్యోగం..
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:40 AM
సొంత ఊర్లోనే ఉంటూ ఐటీ ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ ‘వర్క్‌స్పేస్’ విధానాన్ని తీసుకువచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండల కేంద్రంలోనూ...
మండలానికో వర్క్‌స్పేస్ సెంటర్
కనీసం 610 మంది పనిచేసేలా సదుపాయాలు, రోజంతా కరెంట్
హైస్పీడ్ నెట్, వీసీ సౌకర్యం తప్పనిసరి
సమావేశాలకు ప్రత్యేక గది, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్ సౌకర్యం
వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
ఇంటర్నెట్ డెస్క్: సొంత ఊర్లోనే ఉంటూ ఐటీ ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ ‘వర్క్‌స్పేస్’ విధానాన్ని తీసుకువచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండల కేంద్రంలోనూ అతితక్కువ వ్యయంతోనే వర్తక, వాణిజ్య లావాదేవీలు చేపట్టేందుకు అనుకూలంగా తీసుకొచ్చిన ఈ పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఐటీ రంగంలో విశేష అనుభవం ఉన్నా వర్తక, వాణిజ్య వ్యవహారాలకు సంబంధించిన అన్ని సదుపాయాలనూ సమకూర్చుకునే స్థోమత అందరిలోనూ ఉండదు. ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రతి మండలంలోనూ వర్క్‌స్పేస్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా అందరికీ సమానావకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వర్క్‌స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వర్క్‌స్పేస్ సౌకర్యాలు కల్పించేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ‘వర్క్‌స్పేస్’ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది.
కనీసం 610 మంది పనిచేసేలా...
మండల స్థాయిలో వర్క్‌స్పేస్ కోసం కనిష్ఠంగా 1000 చదరపు గజాల్లో 610 మంది పనిచేసేలా సదుపాయాలు ఉండాలని ఐటీ శాఖ పాలసీలో పొందుపరిచింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు వీలుగా హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ ఉండాలని, బిజినెస్ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేక గది, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్ సదుపాయాలు ఉండాలని పేర్కొంది. రోజంతా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించింది. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ స్కిల్స్ నేర్పేందుకు కావలసిన సదుపాయాలన్నీ ఉండాలని పేర్కొంది. పాలసీలో భాగంగా మండలాల్లో ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటుచేసిన వర్క్‌స్పే్‌సలకు నామమాత్రపు అద్దెలో 100 శాతాన్ని ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేసే వర్క్‌స్పే్‌సలకు ఏటా రూ.6 లక్షలకు మించకుండా 50 శాతం అద్దెను భరిస్తుంది. ఎర్లీ బర్డ్ పాలసీ కింద ముందుగా వచ్చేవారికి పెట్టుబడి రాయితీ రూ.15 లక్షలకు మించకుండా 60 శాతం వరకూ ఇవ్వనుంది. హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ కోసం 50 శాతం కనెక్షన్ చార్జీలను చెల్లించనుంది.