ఏఐ ప్రాజెక్టులకు ఏపీని సిద్ధం చేస్తున్నాం: లోకేశ్
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:01 AM
కృత్రిమ మేధ(ఏఐ)ని అందిపుచ్చుకోవడంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండటం యాదృచ్ఛికం కాదు.
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘కృత్రిమ మేధ(ఏఐ)ని అందిపుచ్చుకోవడంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండటం యాదృచ్ఛికం కాదు. పాలన, ఫిన్‌టెక్, ఆరోగ్య రంగం వంటి వాటిలో ఏఐ వినియోగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఈ ఘనత సాధించాం’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘కృత్రిమ మేధ విస్తృత వినియోగం ద్వారా ఏఐ హబ్‌లు, డేటా సెంటర్లకు డిమాండ్ పెంచుతున్నాం. అదే సమయంలో మౌలిక వసతులతో కూడిన ఏఐ డేటా సెంటర్లు, విద్యుత్తు, భూమి, త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ద్వారా ఏపీని కృత్రిమ మేథ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువుగా సిద్ధం చేస్తున్నాం’ అంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన పోస్టుకు ఏఐ అడాప్షన్ ర్యాంకింగ్‌లో 53 శాతంతో ఇండియా అగ్రస్థానంలో నిలిచిందన్న వార్తను ట్యాగ్ చేశారు.