Krishna River Dispute: తెలంగాణను నిలువరించండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:32 AM
జల విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించండి’ అని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, కృష్ణానదీ యాజమాన్య సంస్థ...
జల విద్యుదుత్పత్తి కోసం ప్రాజెక్టులను ఖాళీ చేసేస్తోంది
కేఆర్‌ఎంబీకి ఈఎన్‌సీ నరసింహమూర్తి లేఖ
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘జల విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించండి’ అని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, కృష్ణానదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాశారు. ‘జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీటిని తోడేస్తూ తెలంగాణ ప్రాజెక్టులను ఖాళీ చేసేస్తోంది. శ్రీశైలం జలాశయం ఎడమవైపు నుంచి తెలంగాణ జల విద్యుదుత్పత్తి చేసేందుకు ఇప్పటికే 27,921 క్యూసెక్కుల ప్రవాహాన్ని వాడేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 10,448 క్యూసెక్కులను మాత్రమే విద్యుదుత్పత్తి కోసం వినియోగించింది. నాగార్జున సాగర్ నుంచి 34,033 క్యూసెక్కులు, పులిచింతల నుంచి 16,600 క్యూసెక్కులను, 7,313 క్యూసెక్కుల వరద జలాలనూ తెలంగాణ వాడుకుంది. ఈ నెల 10 వరకూ విద్యుదుత్పత్తి కోసం ఈ స్థాయిలో తెలంగాణ నీటిని అనధికారికంగా తోడేసింది. దాని చర్యను అడ్డుకోవాలి. రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో వర్షాలు పడే అవకాశాలు లేవు. వరద వచ్చే వీలూ లేదు. తక్షణమే తెలంగాణ జల విద్యుదుత్పత్తి ఆపకపోతే ప్రాజెక్టులు ఖాళీ అయిపోతాయి’ అంటూ ఈఎన్‌సీ, కేఆర్‌ఎంబీకి వివరించారు.