Public Holidays: 2026లో సాధారణ సెలవులు 24
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:04 AM
రాష్ట్రంలో వచ్చే ఏడాది(2026) సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆదివారం వచ్చిన శివరాత్రి, దుర్గాష్టమి, దీపావళి
21 ఐచ్ఛిక సెలవులు
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది(2026) సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
