Nuzividu Chairperson Triveni Durga: ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది నిర్మాణాత్మక పాత్ర
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:01 AM
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్మాణాత్మక, బాధ్యతాయుత పాత్ర పోషిస్తోందని ఏలూరు జిల్లా నూజివీడు మునిసిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ అన్నారు.
నూజివీడు చైర్‌పర్సన్ త్రివేణిదుర్గ
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ సమావేశం
నూజివీడు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్మాణాత్మక, బాధ్యతాయుత పాత్ర పోషిస్తోందని ఏలూరు జిల్లా నూజివీడు మునిసిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ అన్నారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సక్సెస్ మీట్ నూజివీడులోని సంగం కాంప్లెక్స్‌లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు తమ కౌన్సిల్‌తోపాటు మంత్రి పార్థసారథి కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు నూతక్కి వేణుగోపాలరావు, పట్టణ బీజేపీ అధ్యక్షురాలు ఎం.నాగరాణి, మున్సిపల్ అధికారులు, ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది పాల్గొన్నారు.
రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు
‘ఆంధ్రజ్యోతి’ జనవరి 28న నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి దాదాపు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీనిలో రూ.2కోట్లు ఖర్చు చేసి చెరువు గండ్లు పూడ్చారు. రూ.80 లక్షలతో నూజివీడు-తిరువూరు ప్రధాన రహదారిని అభివృద్ధి చేశారు. ట్రిపుల్ ఐటీ మురుగునీటి సమస్యకు రూ.3.75 కోట్లతో పరిష్కారం చూపారు. ఇండోర్ స్టేడియం పనులకు రూ.2కోట్లు మంజూరు చేయించారు. పట్టణంలో రహదారుల అభివృద్ధికి రూ.2.86 కోట్లు మంజూరు చేయగా, కొన్ని టెండర్ దశలో, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రూ.68 లక్షలతో డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. పార్క్‌ల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు రూ.48 లక్షలు మంజూరు చేశారు. పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు కోసం డీపీఆర్‌ను రూపొందించి మంత్రి కొలుసు కేంద్ర ప్రభుత్వానికి పంపారు.