Andhra Jyothi Photographers Win Awards: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:19 AM
186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్..
విజయవాడ (గాంధీనగర్), ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు లక్ష్మణ్(విజయవాడ), లావణ్యకుమార్ (తిరుపతి), సాయికుమార్(తిరుపతి) విజేతలుగా నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగింది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ చైర్మ న్ సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి సురే్‌షకుమార్ మాట్లాడుతూ ఫొటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన ప్రతి చిత్రం స్ఫూర్తిదాయకం, సందేశాత్మకమన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఫొటో జర్నలిస్టులు నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటిలోని లోటుపాట్లను సరిదిద్దడంలో ఫొటోగ్రాఫర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు పీవీ కృష్ణారావు, సీనియర్ ఫొటో జర్నలిస్టులు సీహెచ్‌వీ మస్తాన్, సీహెచ్ నారాయణరావు, ఐఅండ్‌పీఆర్ శాఖలో సీనియర్ ఫొటోగ్రాఫర్ ప్రసాద్‌ను సత్కరించారు.