Share News

Andhra Government: మయన్మార్‌ బాధితులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:21 AM

మయన్మార్‌ సైబర్‌ క్రైమ్‌ ముఠాల చెర నుంచి విముక్తి పొందిన 43 మంది బాధితులను వారి స్వస్థలాలకు చేర్చామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు...

Andhra Government: మయన్మార్‌ బాధితులకు అండగా ప్రభుత్వం

  • స్వస్థలాలకు 43 మంది: మంత్రి కొండపల్లి

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మయన్మార్‌ సైబర్‌ క్రైమ్‌ ముఠాల చెర నుంచి విముక్తి పొందిన 43 మంది బాధితులను వారి స్వస్థలాలకు చేర్చామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రవాసాంధ్రుల వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మయన్మార్‌ నుంచి 370 మంది బాధితులు మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకోగా.. వారిలో విజయవాడ, విశాఖ ప్రాంతాలకు చెందిన 43 మంది ఉన్నారని మంగళవారం ఒక ప్రకటనలో మంత్రి వివరించారు. ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) సూచనలతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు ఆ 43 మందికి భోజనం, వసతి, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ఆ తర్వాత వారందరికీ ఎమర్జెన్సీ కోటా కింద రైలు టికెట్లు ఖరారు చేయించి, మంగళవారం వివిధ రైళ్లలో స్వస్థలాలకు సాగనంపారని పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 06:22 AM