Share News

Bapatla District: అద్దంకిలో నాట్యగణపతి ఆలయం

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:36 AM

బాపట్ల జిల్లా అద్దంకిలో అతి పురాతనమైన వినాయకుని ఆలయం ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలోనే దీన్ని నిర్మించారు.

Bapatla District: అద్దంకిలో నాట్యగణపతి ఆలయం

అద్దంకి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా అద్దంకిలో అతి పురాతనమైన వినాయకుని ఆలయం ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలోనే దీన్ని నిర్మించారు. నాట్య భంగిమలో ఉన్న గణపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. గతంలో ఏరువాక సందర్భంగా రైతులు తమ ఎడ్ల జతలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత పొలాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోవడంతో పూజల వరకే పరిమితమవుతున్నారు.

Updated Date - Aug 27 , 2025 | 05:38 AM