Share News

Anantapur Student: 10 వారాలకు కోటి జీతం!

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:29 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి శంకర నారాయణ, మీనాక్షిదేవి దంపతుల మనవడు కొప్పు సాయిసాకేత్‌ అమెరికాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు..

Anantapur Student: 10 వారాలకు కోటి జీతం!

  • అనంత వాసికి అమెరికాలో భారీ ప్యాకేజీ

గుంతకల్లుటౌన్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి శంకర నారాయణ, మీనాక్షిదేవి దంపతుల మనవడు కొప్పు సాయిసాకేత్‌ అమెరికాలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. పది వారాలకు రూ.కోటి జీతంతో చికాగోకు చెందిన ఒప్‌టివర్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయిసాకేత్‌ ప్రస్తుతం అట్లాంటాలోని జార్జ్‌ టెక్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. బీటెక్‌ మరో ఏడాది మిగిలి ఉండగానే భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాకేత్‌ తండ్రి కొప్పు రమేశ్‌ అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలో ఐటీ సైబర్‌ సెక్యూరిటీ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఎంఎస్‌ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని సాయిసాకేత్‌ తాతయ్య శంకర నారాయణ తెలిపారు.

Updated Date - Sep 08 , 2025 | 02:30 AM