Share News

Anantapur Couple: లోకేశ్‌ వల్లే క్షేమంగా ఇంటికి చేరాం

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:45 AM

దైవ దర్శనం కోసం నేపాల్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన అనంతపురానికి చెందిన దంపతులు మల్లికార్జున, శశికళ క్షేమంగా ఇంటికి చేరారు.

Anantapur Couple: లోకేశ్‌ వల్లే క్షేమంగా ఇంటికి చేరాం

నేపాల్‌ నుంచి తిరిగొచ్చిన అనంతపురం దంపతులు

కృతజ్ఞతగా మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

అనంతపురం క్రైం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనం కోసం నేపాల్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన అనంతపురానికి చెందిన దంపతులు మల్లికార్జున, శశికళ క్షేమంగా ఇంటికి చేరారు. మంత్రి లోకేశ్‌ దయతోనే తాము బతికి బయటపడ్డామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నగర శివారులోని కళాకారు ల కాలనీకి చెందిన ఆ దంపతులు ఈ నెల 4న నేపాల్‌కు వెళ్లారు. అక్కడ అల్లర్లు చెలరేగడంతో స్వదేశానికి తిరిగిరాలేక ప్రాణాలు అరచేతపెట్టుకుని గడిపారు. ఏపీ ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌ స్పందించి, వీరితోపాటు 40 మందిని నేపాల్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి గురువారం రాత్రికి చేర్చారు. అక్కడి నుం చి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వాహనంలో శుక్రవారం తెల్లవారుజాము న వీరిని అనంతపురానికి తీసుకువచ్చింది. అనంతపురం అర్బన్‌ ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివు డు యాదవ్‌ వారిని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దంపతులు తమ అనుభవాలు వివరించారు. నేపాల్‌లో ముక్తినాథ్‌, పశుపతినాథ్‌ ఆలయాల సందర్శనం తరువాత జనక్‌పురి వెళ్లేందుకు సిద్ధమయ్యామని, ఆ సమయంలో మహారాష్ట్రకు చెందిన రెండు బస్సులపై, తాము వెళుతున్న ఏపీ బస్సుపై 30 నుంచి 40 మంది ఆందోళనకారు లు దాడిచేసి అద్దాలు పగలగొట్టారని తెలిపారు. ఏపీ బస్సులో 50 మం దికిపైగా ఉన్నామని చెప్పారు. దాడి తర్వాత డ్రైవరు తమ వాహనాన్ని లాడ్జికి తీసుకొచ్చేశారని వెల్లడించారు. అక్కడి నుంచి ఎంబసీని సంప్రదించామన్నారు. మంత్రి లోకేశ్‌ తమకు భరోసా ఇస్తూ.. ప్రత్యేక విమానంలో ఇంటికి క్షేమంగా చేరుస్తామని మాట ఇచ్చారని తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 06:45 AM