Hill Region Competition: అనంతలో బైక్.. కార్ రేస్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:06 AM
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులో బైకు, కార్ రేస్ పోటీలు జరుగుతున్నాయి.
పుట్లూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులో బైకు, కార్ రేస్ పోటీలు జరుగుతున్నాయి. ‘దక్షణి డేర్ క్రాస్ కంట్రీ ర్యాలీ అండ్ బైక్ రేస్’ పేరిట ఈ పోటీలను 3 రోజులపాటు నిర్వహిస్తున్నారు. పుట్లూరు మండలం నుంచి నార్పల మండలం వరకూ ఉన్న కొండ ప్రాంతాల్లో జరుగుతున్న బైక్, కార్ రేస్‌లో ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు, కేరళల రేసర్లు పాల్గొన్నారు.