Share News

జగన్‌ గూగుల్‌ తెచ్చాడంటే ఎవరూ నమ్మరు: అనగాని

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:10 AM

నిజం చెబితే తల వెయ్యి చెక్కలు అవుతుందని జగన్‌ రెడ్డికి శాపం ఉన్నట్టు ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఎద్దేవా చేశారు.

జగన్‌ గూగుల్‌ తెచ్చాడంటే ఎవరూ నమ్మరు: అనగాని

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): నిజం చెబితే తల వెయ్యి చెక్కలు అవుతుందని జగన్‌ రెడ్డికి శాపం ఉన్నట్టు ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఎద్దేవా చేశారు. ‘ఒక్క ఆధారం చూపకుండా జగన్‌ రెండు గంటలపాటు ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రజల సమయాన్ని వృథా చేసినందుకు సిగ్గుపడాలి. విశాఖకు గూగుల్‌ని జగన్‌ తెచ్చాడని అంటే ఆయన కుటుంబంలో మిగిలిన ముగ్గురు సభ్యులే నమ్మరు. నకిలీ మద్యానికి జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌’ అని అనగాని విమర్శించారు.

Updated Date - Oct 24 , 2025 | 04:11 AM