Share News

వైసీపీ నేతలవి చిల్లర రాజకీయాలు: అనగాని

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:47 AM

‘ప్రజలకు ఉపయోగపడే పాజిటివ్‌ వాతావరణంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

వైసీపీ నేతలవి చిల్లర రాజకీయాలు: అనగాని

అనంతపురం క్రైం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలకు ఉపయోగపడే పాజిటివ్‌ వాతావరణంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్‌ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. రూ.600 కోట్లు పెట్టి రిషికొండపై ప్యాలెస్‌ కట్టేబదులు వారి హయాంలోనే ఎందుకు మెడికల్‌ కాలేజీలు నిర్మించలేదు? వైసీపీ నాయకుల్లా మేం రాష్ట్రాన్ని దోచుకుని, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం లేదు’ అని అనగాని అన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 04:48 AM