అంబేడ్కర్ గురుకులాన్ని విలీనంచేస్తే ఉద్యమమే
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:26 PM
బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లె మహాగురుకు లంలో కందిమల్లాయపల్లెలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలను విలీనం చేయాలని చూస్తే ఉద్య మిస్తామని సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్ తదితర ప్రజాసం ఘాల నాయకులు డిమాండ్ చేశా రు.
బ్రహ్మంగారిమఠం, జూన 29 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లె మహాగురుకు లంలో కందిమల్లాయపల్లెలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలను విలీనం చేయాలని చూస్తే ఉద్య మిస్తామని సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్ తదితర ప్రజాసం ఘాల నాయకులు డిమాండ్ చేశా రు. ఆదివారం మఠంలోని అంబేడ్క ర్ గురుకుల పాఠశాలను సీపీఐ మండలకార్యదర్శి పెదుళ్లపల్లె ప్రభాకర్, సీపీఎం మండల కార్యదర్శి సునీల్‌కుమార్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974లో ఏర్పాటైన అంబేడ్కర్ గురు కులాన్ని తరలించాలని ముందు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా? అని ప్రశ్నించడంతోపాటు విద్యాకమిటీ సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారా? అన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్య దర్శులు సోమిరెడ్డిపల్లె నారాయణ, చేజర్ల రవి, ఎమ్మార్పీఎస్ నాయకుడు ఓబన్న, విద్యార్ధి ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.