Ambedkar statue: శ్రీకాకుళంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:09 AM
శ్రీకాకుళం నగరంలోని బాలాజీనగర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని బాలాజీనగర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. స్థానికులు సోమవారం ఉదయం విగ్రహానికి చేయి పాక్షికంగా విరిగి ఉండడాన్ని గమనించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దగ్గరలో ఉన్న సీసీ పుటేజ్‌ల ఆధారంగా ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో విగ్రహంపై దాడి చేసి ఉంటారా? ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారా? అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు విగ్రహం చేతిని ధ్వంసం చేయడం గుర్తించారు.