అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:52 PM
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన మాబున్నీసా, కమిషనర్ బండి శేష న్న అన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన మాబున్నీసా
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి
నంద్యాల టౌన, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన మాబున్నీసా, కమిషనర్ బండి శేష న్న అన్నారు. శనివారం కార్యాలయంలో అం బేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన శ్రీధర్ , మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: బండి ఆత్మకూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి సీపీఎం నాయకుడు రత్నమయ్య, వ్యకాస నాయకుడు కుళాయి, డేవిడ్, సుబ్బరాయుడు, సీఐటీయూ నాయకుడు రాజు, ఎమ్మార్పీఎస్ నాయకుడు వెంకటసుబ్బన్న పూలమాల వేసి నివాళి అర్పించారు.
పాణ్యం : స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ జయరామిరెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
కొత్తపల్లి : మండలంలోని జి. వీరాపురం గ్రామంలో అంబేడ్కర్ యూత ప్రెసిడెంట్ జి.మల్లయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఎ్‌సఎ్‌ఫఐ నాయకులు దినేష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
పాములపాడు: మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ నాగన్న, అబ్రహాం, అంకన్న, నాగరాజు, సంజీవరాయుడు పాల్గొన్నారు.
ఆత్మకూరు: ప్రపంచ మేధావుల్లోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని ప్రజాసంఘాల నాయకులు మల్లె ఎలీషా, చిలుక రాబినసనరాజు, మురహరి మల్లయ్య, దర్గయ్య, బుజ్జ న్న అన్నారు. పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న ఉన్నారు.
వెలుగోడు : మండల కేంద్రంలో ఎస్‌డీపీఐ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమాలల్లో ఎసడీపీఐ నాయకులు బేగ్, ఆరీఫ్, సర్పంచ జయపాల్, నాగశేషులు, షంషీర్ తదితరులు పాల్గొన్నారు.