Share News

Chandrababu Naidu: ఐకానిక్‌గా రాజధాని నిర్మాణాలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:36 AM

ఈ సీజన్‌లోనే నిర్మాణాలు పూర్తిచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని సీఆర్డీయే అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu Naidu: ఐకానిక్‌గా రాజధాని నిర్మాణాలు

  • యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టండి

  • మరే ప్రాంతానికీ ఇన్ని భౌగోళిక అనుకూలతలు లేవు.. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం

  • త్వరలో అమరావతికి బయో ఇంజనీరింగ్‌ వర్సిటీ.. సీఆర్డీఏ అథారిటీ భేటీలో చంద్రబాబు వెల్లడి

  • 904 కోట్లతో రాజధాని గ్రామాలకు వసతులు.. అమరావతిలో కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు

  • మంగళగిరిలో గోల్డ్‌ క్లస్టర్‌ కోసం భూసమీకరణ.. మొత్తం 9 ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదం

  • పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఈ సీజన్‌లోనే నిర్మాణాలు పూర్తిచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని సీఆర్డీయే అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.దీనికోసం రాజధాని పనులను యుద్ధప్రాతిపదిక చేపట్టాలని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు.అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన 51 సీఆర్డీఏ సమావేశం జరిగింది.దేశంలో మరే ప్రాంతానికీ లేని భౌగోళిక పరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని, అందువల్ల ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్‌గా ఉండాలని ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలి .ఎస్పీవీ ద్వారా చేపట్టే స్పోర్ట్స్‌ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలి. రివర్‌ ఫ్రంట్‌,రోప్‌వే , ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులను అనుసంధానించాలి.త్వరలోనే ప్రతిష్ఠాత్మక బయో ఇంజనీరింగ్‌ యూనివర్సిటీ అమరావతికి రానుంది.’’ అని చంద్రబాబు తెలిపారు.ఆ వివరాలు మంత్రి పి. నారాయణ మీడియాకు తెలిపారు.


తొమ్మిది ప్రతిపాదనలకు ఓకే..

రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లో డ్రయిన్లు, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమో దం తెలిపింది.ఎల్పీఎస్‌ జోన్స్‌ క్రిటికల్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద ఈ పనులు చేపట్టనున్నారు.9 ప్రతిపాదనలకు అథారిటీ ఆమో దం తెలిపారు.అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు అద్భుతమైన డిజైన్‌ ఎంపిక చేయాలని సీఎం ఆదేశించా రు.సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు డిజైన్లను పరిశీలించాలని సూచించారు.రాజధానిలో చేపట్టే వివిధ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌(ఎస్పీవీ) ఏర్పాటు కు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదం తెలియజేసిం ది.రాజధానిలో చేపట్టనున్న గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పో ర్టు, ఎన్టీఆర్‌ విగ్రహం, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ , రివర్‌ ఫ్రంట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రోప్‌ వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78.01 ఎకరాల్లో గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలన్న ప్రతిపాదనను అథారిటీ ఆమోదించింది.గోల్డ్‌ క్లస్టర్‌ వల్ల రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అథారిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.ల్యాండ్‌పూలింగ్‌లో పట్టాభూములతోపా టు అసైన్డ్‌భూములను కూడా సేకరించారు.అయితే, సర్టిఫికెట్లలో అసైన్డ్‌ భూమి అని ప్రస్తావన చేయొద్దంటూ భూదాతలు చేస్తున్న విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు సానుకూలగా స్పందించారు.యాజమాన్య ధ్రువీకరణ సర్టిఫికెట్‌లో ఆ పదాన్ని తొలగించాలన్న సూచనకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.రాజధానిలో సీవరేజ్‌ వాటర్‌ ట్రీట్‌మెం ట్‌ ప్లాంట్‌ను రూ.411 కోట్లు, వాటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను రూ.376.60 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలకు అదన పు భూ కేటాయింపులు చేసేందుకు సమ్మతించింది..ఈ నెల 21న జరిగే క్యాబినెట్‌లో పెట్టి ఆమోదం తెలపనున్నారు.


అమరావ తి మునకపై వైసీపీ దుష్ప్రచారం,

మార్చి 31కి 4 వేల గృహాలు పూర్తి : నారాయణ

2026, మార్చి 31 కల్లా దాదాపు 4 వేల గృహాలను పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.అమరావతి మునిగిపోతోందని దుష్ప్రచారం చేసేవారు,ఇక్కడకు వచ్చి ఎక్కడ మునిగిందో చూపించాలని సవాల్‌ చేశారు. ‘‘రాజధాని పనుల్లో భాగంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ సమయంలో వచ్చిన మట్టిని కాలువలో వేయడంతో నీరు నిలిచింది. దానిని గుర్తించి వెంటనే సీఆర్‌డీఏ అధికారులు క్లియర్‌ చేశారు.ఎక్కడ ఇళ్లు కట్టుకోవాలన్నా గుంతలు తవ్వుతా రు. వర్షం వస్తే ఆ గుంతల్లోకి నీళ్లు రావా?.అలాగే, ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణం కోసం చుట్టూ గుంతలు తవ్వాం.అక్కడ వాన వస్తే నీళ్లు నిలవకుండా ఎలా ఉంటాయి?.వాస్తవం ఇది కాగా, ఐకానిక్‌ టవర్లలోకి నీరు వచ్చాయంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘అమరావతి క్యాపిటల్‌ సిటీ డి జైన్‌ చేసినప్పుడు సీడ్‌ క్యాపిటల్‌కు కుడి, ఎడమ పక్కల రెండు బ్రిడ్జిలు నిర్మించాలనుకున్నాం.దానిలో భాగంగా వైకుంఠపురం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి వ స్తుంది.’’అని నారాయణ వివరించారు. అమరావతిలో ఏడీసీ, సీఆర్‌డీఏలు పనులు చేస్తున్నాయని మంత్రి తెలిపారు.రాజధానికి అదనపు భూసమీకరణ విషయంలో మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి త్వరలోనే క్యాబినెట్‌కు తీసుకువస్తామన్నారు.కరకట్ట రోడ్డుపై 2 వైపులా రివర్టింగ్‌ వాల్‌ కట్టాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ను అనుసంధాస్తూ వై ఆకారంలో మరో రోడ్డును మంగళగిరి వైపు కలుపుతామని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని తె లిపారు.

Updated Date - Aug 19 , 2025 | 04:37 AM