NABARD Loan Cleared For Amaravati: అమరావతిలో మౌలిక వసతులకు నాబార్డు నుంచి 7,387 కోట్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:02 AM
రాజధాని అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నాబార్డు నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ అసిస్టెన్స్ స్కీం కింద రూ.7,387.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి...
రాజధాని అమరావతి ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నాబార్డు నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ అసిస్టెన్స్ స్కీం కింద రూ.7,387.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.
అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి, డిజైన్-బిల్డ్ విధానంలో టెండరు మంజూరుకు, ఈ ప్రాజెక్టుకు రూ.137 కోట్లతో పరిపాలనా ఆమోదం, ఎల్-1 బిడ్డర్ ఎల్ అండ్ టీ కంపెనీకి కాంట్రాక్టు కేటాయించేందుకు అనుమతి.
ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఆర్థిక సహాయంతో అమరావతి క్యాపిటల్ సిటీ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం కింద సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్, కనస్ట్రక్షన్, టెస్టింగ్, ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 వంటి పనులను 15 ఏళ్లు ఆపరేషన్, మెయింటినెన్స్‌తో కాంట్రాక్టు (ు టెండర్) ప్రాతిపాదికన ఎల్-1 బిడ్‌ను ఆమోదించడానికి ఏడీసీఎల్ చైర్మన్‌కు అధికారం.
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ స్కీంల లే ఔట్‌లలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో జోన్-8లోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనమాక, ఉండవల్లి గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, వాటర్ సప్లయ్, సీనరేజ్, విద్యుత్ తదితర పనులకు ఎల్1 బిడ్ ఆమోదించడానికి ఏడీసీఎల్ చైర్మన్‌కు అనుమతి.
మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో భూగర్భ డ్రెయినేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ.1,673.51 కోట్ల కేటాయింపు
ఇండియన్ ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం) ఏర్పాటు కోసం ఏలూరు జిల్లా నూజివీడులోని 9.96 ఎకరాల ప్రభుత్వ భూమి 33 ఏళ్ల లీజుకు బదిలీ.
కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్‌కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం 9.88 ఎకరాల భూమిని లీజును మూడేళ్లకు పునరుద్ధరించడానికి ఆమోదం.
స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు తిరుపతి జిల్లా దామినేడులో 28.37 ఎకరాల ప్రభుత్వ భూమి ’శాప్’కు ఉచితంగా బదిలీ.
తిరుపతి జిల్లా శెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీం కింద తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ అమలు చేసిన అన్ని కన్వేయెన్స్ డీడ్స్‌కు సంబంధించిన లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్ ఫీజు మినహాయింపు.
సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు, తదుపరి చర్యలకు ఆమోదం.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జనవరి1 నుంచి డీఏ/డీఆర్ 3.64ు(33.67శాతం నుంచి 37.31శాతానికి) పెంపుదల అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులకు ఆమోదం (2025 అక్టోబరు నెల జీతం నుంచి ఈ ప్రయోజనం అందేలా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది).
లైఫ్ ట్యాక్స్ వర్తించే మోటార్ వెహికల్స్‌పై ఆ పన్నులో 10ు రోడ్డు భద్రత సెస్‌గా వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఆమోదం.
గ్రామ/వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలుగా మారుస్తూ ఆర్డినెన్స్ జారీకి అంగీకారం.
ఈ-కోర్ట్సు ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టుల్లో 13 సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు, 26 సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ఆమోదం. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న సిబ్బంది కొత్త పోస్టుల్లో నియామకం. మిగిలిన ఖాళీలకు కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు ఆమోదం.
దొరవానిసత్రం, తడ మండలాల్లో కాళంగి నది ఎడమ ఒడ్డున ఉన్న ఫ్లడ్ బ్యాంక్ అభివృద్ధికి సంబంధించి ప్యాకేజీ-1 పనుల రద్దు.
తిరుపతి జిల్లా పేరూరులోని ప్రభుత్వ భూమిలో ‘హయత్ రీజెన్సీ’ పేరుతో ఫైర్‌స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటుకు ఎంఆర్‌కేఆర్ నిర్మాణ సంస్థతో 2024 ఫిబ్రవరి 14న కుదిరిన లీజు ఒప్పందం రద్దు. కంపెనీ చెల్లించిన చట్టబద్ధ రుసుము తిరిగి చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం.
తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ డెవల్‌పమెంట్ స్కీం కింద గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ మెరైన్ బోర్డు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆమోదం.
దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం నెల్లూరు జిల్లా దామవరంలో 418.14 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు అనుమతి. శాశ్వత లీజు హోల్డర్‌కు ఎకరా రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఆమోదం.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడివాడలో 18.57 ఎకరాల ప్రభుత్వ భూమి రాష్ట్రీయ సేవా సమితికి బదిలీ. ఎకరానికి రూ.80 లక్షల చొప్పున చెల్లించాలన్న కలెక్టర్ ప్రతిపాదన మేరకు భూస్వామ్య హక్కుల బదిలీకి అనుమతి.
పశ్చిమ బాపటల్లో రెండెకరాల ప్రభుత్వ భూమి బాపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడికి లీజు పద్ధతిలో కేటాయింపు. అందులో జిల్లా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి అనుమతి. ఎకరానికి ఏటా రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు.
హైకోర్టు ఆదేశాల మేరకు అటవీ శాఖలో కె.సురేశ్‌కుమార్‌ను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్టగా నియమించడానికి ఆమోదం.