విశ్వకర్మ ఆశీస్సులతో ప్రపంచస్థాయిలో అమరావతి: మాధవ్
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:10 AM
విశ్వకర్మ ఆశీస్సులతో ప్రపంచస్థాయి నగరంగా రాజధాని అమరావతి అవుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
తుళ్లూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): విశ్వకర్మ ఆశీస్సులతో ప్రపంచస్థాయి నగరంగా రాజధాని అమరావతి అవుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయునిపాలెంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. హోమాలు చేసి, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ‘రాజధానిలో విశ్వకర్మ విగ్రహ ఏర్పాటుకి కృషి చేస్తా. సర్వప్రాణులు భగవంతుని స్వరూపాలు. ఆర్‌ఎ్‌సఎస్ దేశ అస్తిత్వాన్ని, మూలలను సరిచేస్తుం ది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలను ప్రధాని మోదీ తీసుకొచ్చారు. దేశం గురించి ఆలోచించే పార్టీ బీజేపీనే’ అని మాధవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపికృష్ణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.