Share News

Amaravati Quantum Valley: అమరావతికి క్వాంటమ్‌ వ్యాలీ కీలకం

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:45 AM

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ అంత పేరు తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో...

Amaravati Quantum Valley: అమరావతికి క్వాంటమ్‌ వ్యాలీ కీలకం

  • సిలికాన్‌ వ్యాలీ తరహా గుర్తింపు.. 30న బెజవాడలో వర్క్‌షాపు: బాబు

  • అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, జూన్‌ 9 ( ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ అంత పేరు తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌పై ఐటీ నిపుణులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30న విజయవాడలో క్వాంటమ్‌ మిషన్‌పై వర్క్‌షాపును నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షన క్వాంటమ్‌ మిషన్‌ పనిచేస్తుందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కార్యాచరణను గురించి వివరించారు. క్వాంటమ్‌ ఇన్నొవేషన్‌ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం, జాతీయ క్వాంటమ్‌ మిషన్‌లో భాగస్వామ్యం కావడం, నాలెడ్జ్‌ ఎకానమీని బలోపేతం చేయడం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ముఖ్యోద్దేశమని అధికారులు వివరించారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ సెన్సింగ్‌, మెట్రాలజీ, క్వాంటమ్‌ మెటీరియల్స్‌, డివైజ్‌లపై ప్రధానంగా దృష్టి పెడతున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఏపీ క్వాంటమ్‌ మిషన్‌ రెండు దశల్లో పనిచేస్తుందన్నారు. 2025-26 తొలి దశగానూ.. 2027-30 మలిదశగానూ చేపడతామన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు ఐబీఎం సారథ్యం వహిస్తుందని తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 03:46 AM