Minister Narayana: రాజధానిలో పచ్చదనానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:23 AM
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ర్టీస్ కోసం మరికొంత భూమి అవసరం అవుతుంది
మాస్టర్ ప్లాన్ ప్రకారం 30శాతం బ్లూ అండ్ గ్రీన్
రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 900 కోట్లు
జనవరి చివరి నుంచి సుందరీకరణ పనులు: మంత్రి నారాయణ
తుళ్లూరు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ర్టీస్ కోసం మరికొంత భూమి అవసరం అవుతుంది. ఇందుకు కసరత్తు జరుగుతోంది’ అని మంత్రి నారాయణ తెలిపారు. రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘రెండో దశ భూసమీకరణలో 16,666 ఎకరాలకు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూమి రైల్వే ట్రాక్, రైల్వే ేస్టషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరిస్తున్నాం. ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. అమ్యూజ్ మెంట్ పార్కులు, ఎకో రిసార్ట్స్, మ్యూజికల్ ఫౌంటెయిన్స్‌తో రాజధానిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో 30ు బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాం. అనంతవరం వద్ద 31 ఎకరాల్లో లంగ్ ేస్పస్ పార్కులు, కురగల్లు వద్ద 200 ఎకరాల్లో బయో డైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఎల్పీఎస్ జోన్ల లో 1,602 ఎకరాల మేర ఎకరం నుంచి పదెకరాల లోపు విస్తీర్ణంలో పార్కులు నిర్మిస్తున్నాం. కృష్ణాయపాలెం రిజర్వాయర్ వద్ద 71 ఎకరాలు, నీరుకొండ రిజర్వాయర్ వద్ద 158 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని రాజధాని రైతులకు సమాచారం ఇస్తున్నాం.
రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.900 కోట్లతో పనులు చేపడుతున్నాం’ అని మంత్రి నారాయణ తెలిపారు. సమావేశంలో ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారఽథి, ఛీఫ్ ఇంజనీర్ బి.నరసింహమూర్తి, హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ వి.ఎస్ .ధర్మజ డిప్యూటీ డైరెక్టర్ బి.శ్రీనివాసులు, అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్టు హెచ్‌వోడీ డాక్టర్ పి.సురేశ్‌బాబు, ఐపీడీ హెచ్‌వోడీ డాక్టర్ కేవీ గణేశ్ బాబు, టూరిజం సీనియర్ కన్సల్టెంటు బీ మనోహరరావు, పీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.