Share News

Construction Progress: చకచకా రాజధాని పనులు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:47 AM

రాష్ట్ర రాజధానిలో కీలకమైన ఐకానిక్‌ భవనాల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు. బేస్‌మెంట్‌ నుంచి రెండు ఫ్లోర్ల పనులు స్పీడ్‌గా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు భావిస్తున్నాయి.

Construction Progress: చకచకా రాజధాని పనులు

  • ఊపందుకున్న ఐకానిక్‌ భవనాల నిర్మాణం

  • రేయింబవళ్లు జీఏడీ, సెక్రటేరియట్‌ టవర్ల పనులు

  • 5 టవర్లలో ఏకకాలంలో పనుల కొనసాగింపు

  • ఆరు నెలల్లో బేస్‌మెంట్‌ దాటి బయటకు

  • జడ్జీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీల భవనాల్లోనూ పురోగతి

  • మరో మూడు నెలల్లో ఇంటీరియర్‌ దశకు

  • వేగంగా మంచినీటి పైపుల ఏర్పాటు

రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్‌ భవనాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. జీఏడీ, సెక్రటేరియట్‌ టవర్ల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అలాగే జడ్జీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ భవనాల పనులూ 3 నెలల్లో కొలిక్కి రానున్నాయి. మంచినీటి పైపులైన్ల పనులు వేగం పుంజుకున్నాయి. రెండు నెలల కిందటే ఐకానిక్‌ భవనాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినా.. వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉండటంతో పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రాష్ట్ర రాజధానిలో కీలకమైన ఐకానిక్‌ భవనాల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు. బేస్‌మెంట్‌ నుంచి రెండు ఫ్లోర్ల పనులు స్పీడ్‌గా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు భావిస్తున్నాయి. త్వరగా ఎగువ బేస్‌మెంట్‌ పనులు చేపడితే వర్షాల వల్ల పనులు నిలిచే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో రాత్రింబవళ్లూ పనులు చేస్తున్నారు. మొత్తం 5 ఐకానిక్‌ టవర్లలో ప్రధానమైనది జీఏడీ టవర్‌. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌ సహా మొత్తం 47 అంతస్తుల భవనం ఇది. ప్యాకేజీ-1లో రూ. 1,126 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం, టవర్‌పైన హెలిప్యాడ్‌ను కూడా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దీని బేస్‌మెంట్‌ చుట్టూ మిగిలిపోయిన బ్యాలెన్‌ ్స కాంక్రీట్‌ పనులు చేపడుతున్నారు. బేస్‌మెంట్‌పై ఐరన్‌ బ్యారికేడింగ్‌ పను లు పూర్తయ్యాయి. నిరంతరాయంగా కాం క్రీట్‌ పను లు చేస్తే 2, 3 నెలల్లో జీఏడీ టవర్‌ పనుల పురోగతి బయటకు కనిపిస్తుందని కాం ట్రాక్టు సంస్థ అంచనా వేస్తోంది.


40 అంతస్తుల్లో సెక్రటేరియట్‌ టవర్లు

ఇక సెక్ర టేరియట్‌ టవర్ల విషయానికి వస్తే.. ఒకటి, రెండు టవర్లను ప్యాకేజీ-2లో భాగం గా రూ. 1,897 కోట్లతో, మూడు, నాలుగు టవర్లను ప్యాకేజీ-3లో భాగం గా రూ.1,664 కోట్లతో నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ఈ భవంతులు 40 అంతస్తుల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఈ నాలుగు టవర్ల పనులు కూడా ఏకకాలంలో మొదలయ్యాయి. కొన్నింటికి టవర్ల నాలుగు వైపులా అదనంగా ఫైలింగ్‌ పనులు చేయాల్సి ఉండటంతో వాటిని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. వాటికి సం బంధించిన కాంక్రీటిం గ్‌ పనులు కూడా జరుగుతున్నాయి. మిగిలిన టవర్ల బ్యాలెన్స్‌ పనుల కోసం బ్యారికేడింగ్‌ పను లు చేపట్టారు. నిరంతరాయంగా ఈ పనులు కొన సాగుతున్నాయి. కాంక్రీ ట్‌ మిక్సింగ్‌ ప్లాం ట్లు రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాయి. అన్ని టవర్లను కూడా గతంలోనే రాఫ్ట్‌ టెక్నాలజీ విధానంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీ వల్ల భూ కంపాలను కూడా తట్టుకునే సావ ర్థ్యం ఉంటుంది. ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మా ణ పను లు ఇదే రీతిన జరిగి తే ఆరు నెలల్లోనే పనుల పురోగతి కనిపి స్తుంది.


వేగంగా పైపులైన్లు, మొక్కలు నాటే పనులు

అమరావతిలోని రోడ్ల వెంబడి ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైపులైన్ల పనుల్లో వేగం పెరిగింది. ఈ పనుల్లో ప్రస్తుతం 30 శాతం పనులు ఊపందుకున్నాయి. భారీ ఐరన్‌ పైపులను ఏర్పాటు చేసి వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏడీసీఎల్‌ అభివృద్ధి పరిచిన మొక్కలను కూడా పైపులకు సమీపంలో రెండువైపులా నాటుతున్నారు. పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాల్సి వచ్చిన సందర్భంలో వాటిని నరకకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో నర్సరీకి తరలించి అక్కడ బతికిస్తున్నారు. తిరిగి వాటినే మళ్లీ పైపులైన్లు వేసిన చోట ట్రాన్స్‌లోకేట్‌ చేస్తున్నారు.

Untitled-2 copy.jpg

జడ్జిల భవనాల్లోనూ పురోగతి

ఐకానిక్‌ టవర్లు కాకుండా జడ్జిలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీల భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి. వైసీపీ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి. గతంలో పిల్లర్లతో కనిపించినవి ప్రస్తుతం బంగళా ఆకారం సంతరించుకున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌ ఒక్కటే పూర్తయిన వాటిలో ఇప్పుడు మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. కొన్ని భవనాల పనులు ఇప్పుడు మొదలై వేగంగా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో వీటిలో చాలా వరకు ఇంటీరియర్‌ దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Untitled-2 copy.jpg


  • కార్మికుల భద్రతలో ‘అమరావతి’ ఘనత

  • ఎన్‌జీఓ టవర్ల నిర్మాణంలో 10 లక్షల సురక్షితమైన పనిగంటల నమోదు

  • భద్రతా ప్రమాణాలకు ఇదే నిదర్శనమన్న అధికారులు

గుంటూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నిర్మాణ పనుల్లో సురక్షితమైన పనిగంటల విషయంలో రాజధాని అమరావతి ఓ కొత్త ఘనత సాధించింది. ఏపీసీఆర్డీఏ నిర్మిస్తున్న ప్రభుత్వోద్యోగుల గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టిన ఎన్‌జీఓ ఉద్యోగుల టవర్ల నిర్మాణ సంస్థ 9, 12 అపార్టుమెంట్ల పనుల్లో సురక్షితమైన పనిగంటల రికార్డు సాధించింది. ఈ ప్రాజెక్టులో ఈనెల 18వ తేదీనాటికి 10 లక్షల సురక్షితమైన పనిగంటలను నమోదు చేసింది. పని ప్రదేశంలో భద్రతను లెక్కించే ‘లాస్ట్‌ టైమ్‌ ఇంజురీ (ఎల్‌టీఐ)’ రేట్‌ విషయంలో అన్ని పని గంటలను విజయవంతంగా పూర్తిచేసింది. అంటే అన్ని పనిగంటల పాటు ఏ కార్మికుడూ గాయపడకుండా ఉండి, విధులకు హాజరైనట్లు. కాగా, ఇది సీఆర్డీఏ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ ప్రాంతంలో సురక్షిత విధానాలు, కార్మికులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ముందస్తు భద్రతా చర్యల కారణంగా ప్రమాదాలు జరగకుండా నిర్మాణ పనులు నిర్వహించి ఈ మైలురాయిని చేరుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ ఈఎ్‌సఎం విభాగం డైరెక్టర్‌ నితిన్‌ శర్మ సోమవారం మాట్లాడారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టుల్లో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నామని, జాగ్రత్తగా పనిచేేస్త ఎలాంటి ప్రమాదాన్నైనా నివారించగలమన్న నమ్మకాన్ని ఈ ఘనత చాటిచెప్పిందని అన్నారు. ఈసందర్భంగా సీఆర్డీఏ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు, హార్టీకల్చర్‌ డైరెక్టర్‌ ఎం.హరిప్రసాద్‌, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పీబీఎన్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ బీ. అనితావాణి తదితర అధికారలు సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Untitled-2 copy.jpg

Updated Date - Nov 25 , 2025 | 04:52 AM