Donations: అమరావతికి రూ.116లు ఇవ్వండి
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:25 AM
అమరావతి రాజధాని నిర్మాణానికి, నూతన రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ఇచ్చిన ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రజలు కూడా విరాళాలు ఇచ్చేలా చైతన్యం కలిగిస్తున్నారు.
రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించండి
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి పిలుపు
ముదినేపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని నిర్మాణానికి, నూతన రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ఇచ్చిన ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రజలు కూడా విరాళాలు ఇచ్చేలా చైతన్యం కలిగిస్తున్నారు. ఎకరంన్నర పొలం, బంగారం అమ్మి రాజధాని నిర్మాణానికి విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్‌తో కలసి అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యే విధంగా ‘అమరావతికి జీవం పోద్దాం-రూ.116లు సాయం అందిద్దాం’’ అనే నినాదంతో ఆమె విరాళాలు అందజేయాలంటూ పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చే వారు కమిషనర్ ఏపీసీఆర్‌డీఏ, యూనియన్ బ్యాంక్, విజయవాడ లబ్బీపేట బ్రాంచి, అకౌంట్ నంబర్ 034310100118883, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ యూబీఐఎన్ 0803430కు పంపాలి. వైష్ణవి పిలుపునకు స్పందించిన ఒక దాత శుక్రవారం రూ.5116లు విరాళం అందజేశారు.