అమరావతి కేంద్రంగా.. ఇక సీఆర్‌డీఏ పాలన
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:13 AM
అమరావతి కేంద్రంగా ఇక పుర పరిపాలన ప్రారంభం కాబోతోంది. రాజఽధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో సహా మునిసిపల్ పట్టణాభివృద్ధిశాఖ పరిఽధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు ఒకే భవనంలోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడి నుంచే సేవలు అందనున్నాయి.
- నేడు సీఎం చేతుల మీదుగా ప్రధాన కార్యాలయం ప్రారంభం
- రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడి నుంచే సేవలు
- ఉమ్మడి కృష్ణాజిల్లా ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర శాఖల పాలన బెజవాడ నుంచే..
- విజయవాడలో అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఉండే అవకాశం!
అమరావతి కేంద్రంగా ఇక పుర పరిపాలన ప్రారంభం కాబోతోంది. రాజఽధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో సహా మునిసిపల్ పట్టణాభివృద్ధిశాఖ పరిఽధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు ఒకే భవనంలోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడి నుంచే సేవలు అందనున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాజధాని రైతులు, ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి కేంద్రంగా పురపాలన అందుబాటులోకి రాబోతోంది. సీఆర్‌డీఏ ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా విజయవాడ నుంచి కాకుండా ఇక అమరావతి నుంచి జరగనున్నాయి. రాజధాని రైతులు తమ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు విజయవాడ రావాల్సి వచ్చేది. ఇక మీదట తమ స్థానిక ప్రాంతంలోనే కార్యాలయం ఉండటం వల్ల వారికి సౌకర్యంగా ఉంటుంది. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు తమ సమస్యలను చెప్పు కోవడానికి విజయవాడ రావాల్సి వచ్చేది. ఇకమీదట స్థానికంగానే సీఆర్‌డీఏ కార్యాలయం అందుబాటులో ఉండటం వల్ల రాజధాని అపరిష్కృత అంశాల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉండటం వల్ల రాజధాని రైతుల సమస్యలకు సంబంధించి తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రతి సోమవారం అడిషనల్ కమిషనర్ స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉండేవారు. రాజధాని రైతుల సమస్యలన్నీ ఎక్కవుగా ఉన్నతస్థాయి అధికారులతో ముడిపడి ఉండటం వల్ల స్థానికంగా సీఆర్‌డీఏ కార్యాలయం ఉన్నా విజయవాడ రావాల్సి వచ్చేది. తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన స్థానిక వ్యవహారాలకు కేంద్రంగా పనిచేస్తుంది. సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం రాజధాని తరలిపోతున్న తరుణంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లానింగ్, ఇంజనీరింగ్, తదితర అన్ని విభాగాలు కూడా ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించినవారంతా ఇక్కడే పనిచేస్తారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ పనిచేసే అవకాశం ఉంది.
సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలోనే మునిసిపల్ శాఖల హె చ్‌వోడీలు
సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలోనే మునిసిపల్ శాఖలకు చెందిన అన్ని హెచ్‌వోడీ కార్యాలయాలు పనిచేయనున్నాయి. సీఆర్‌డీఏ ప్రధాన భవనం ఈ3 - ఎన్ 11 రోడ్ల జంక్షన్ దగ్గర రాయపూడిలో మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీప్లస్ + 7 విధానంలో నిర్మించారు. మొత్తం 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ఏరియా 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాలలో నిర్మాణం చేశారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
గ్రౌండ్ ఫ్లోర్ 23,184 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఇందులో పబ్లిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రెస్టారెంట్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటర్‌లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ 30,886 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఈ ఫ్లోర్‌లో కాన్ఫరెన్ ్స హాల్స్ ఉంటాయి. రెండవ ఫ్లోర్‌లో 30,886 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ ఫ్లోర్‌లో సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ఉంటుంది. మూడవ ఫ్లోర్ విస్తీర్ణం 32,096 చదరపు అడుగులు ఉంది. ఈ ఫ్లోర్‌ను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) కార్యాలయానికి కేటాయించారు. నాల్గవ ఫ్లోర్‌లో 30,682 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ ఫ్లోర్‌లో మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) ప్రధాన కార్యాలయానికి కేటాయించారు. ఐదవ ఫ్లోర్‌లో 32,096 చదరపు అడుగుల స్థలం ఉంది. దీనిని సీఆర్డీఏ (ఏడీసీఎల్)కు కేటాయించారు. ఆరవ ప్లోర్‌లో 32,096 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఈ ఫ్లోర్‌ను ఏడీసీఎల్‌కు కేటాయించారు. ఏడవ ఫ్లోర్‌ను మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చాంబర్, ఏఎంయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్, పబ్లిక్‌హెల్త్ ఈఎన్‌సీ, ఏడీసీఎల్ టెర్రస్, పీఈబీ డైనింగ్, హెడ్ రూమ్స్ వంటి వాటికి కేటాయిచారు.
ఇతర శాఖలకు..
ప్రధాన బిల్డింగ్ పక్కనే ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏరియాతో కలిపి మరో నాలుగు భవనాలు నిర్మించారు. ఒక్కో భవనాన్ని 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున మొత్తం 1,66,000 విస్తీర్ణంలో నిర్మించారు. మొదటి భవనాన్ని టిడ్కో, ఏపీయూఎఫ్‌ఐడీసీలకు కేటాయించారు. రెండవ భవనాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అప్పీలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్‌లకు కేటాయించారు. మూడవ భవనాన్ని డీటీసీపీ (టౌన్‌ప్లానింగ్), రెరాలకు కేటాయించారు. నాల్గవ భవనాన్ని మెప్మా కార్యాలయానికి కేటాయించారు.