Quantum Computing: క్వాంటమ్ కంప్యూటింగ్‌కు అమరావతిలో 50 ఎకరాలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:51 AM
రాజధాని అమరావతిలో సమాచార, సాంకేతిక రంగం విప్లవం జోరందుకోనుంది. ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ని ప్రారంభించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
133 బిట్, 5కే గేట్స్ కంప్యూటర్ ఏర్పాటుకు సిద్ధమైన ఐబీఎం
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 365 గంటలపాటు ఉచిత ఇంటర్నెట్
ఉత్తర్వు జారీ చేసిన ఐటీశాఖ కార్యదర్శి
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో సమాచార, సాంకేతిక రంగం విప్లవం జోరందుకోనుంది. ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ని ప్రారంభించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీనిలో భాగంగా అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)ని ఏర్పాటు చేసేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో ఏక్యూపీసీ ఏర్పాటు కు 50 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏక్యూసీసీలో 133 బిట్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు, 5కే గేట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకు వచ్చింది. చదరపు అడుగుకు రూ.30 చొప్పున చెల్లించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నాలుగేళ్లపాటు ఏడాదికి 365 గంటలు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి ఐబీఎం అంగీకరించింది.