Share News

AP Govt: అమరజీవి ట్రస్టుకు అమరావతిలో స్థలం

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:10 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ట్రస్టుకు అమరావతిలో స్థలం కేటాయిస్తూ సీఆర్‌డీఏ ఆదేశాలిచ్చింది. సీఎం చంద్రబాబు హామీ మేరకు శాకమూరు పార్కులో...

AP Govt: అమరజీవి ట్రస్టుకు అమరావతిలో స్థలం

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ట్రస్టుకు అమరావతిలో స్థలం కేటాయిస్తూ సీఆర్‌డీఏ ఆదేశాలిచ్చింది. సీఎం చంద్రబాబు హామీ మేరకు శాకమూరు పార్కులో 6.8 ఎకరాలు కేటాయించారు. మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్టు అధ్యక్షులు డూండీ రాకేశ్‌ స్వీకరించారు. 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు స్మృతి వనంను ట్రస్టు ఏర్పాటు చేయనుంది. మార్చి 2026లోగా స్మృతి వనం ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ట్రస్టుకు సూచించారు.

Updated Date - Jul 16 , 2025 | 04:13 AM