Share News

Green Aluminium and Bio-Refinery Projects: ఏపీలో ఏఎం గ్రీన్‌ 54 వేల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:13 AM

ఏపీలో గ్రీన్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌, బయో రిఫైనరీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది.....

Green Aluminium and Bio-Refinery Projects: ఏపీలో ఏఎం గ్రీన్‌ 54 వేల కోట్ల పెట్టుబడులు

  • గ్రీన్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌, బయో రిఫైనరీ ప్రాజెక్టులు

  • కాకినాడ, ఉత్తరాంధ్రలో ప్లాంట్‌లు ఏర్పాటు

విజయవాడ సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీలో గ్రీన్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌, బయో రిఫైనరీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు ఏఎం గ్రీన్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. రూ. 44 వేల కోట్లతో కాకినాడలో 1 ఎంటీపీఏ (మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం)తో గ్రీన్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌, ఉత్తరాంధ్రలో 180 కేటీపీఏ (వేల వార్షిక టన్నుల సామర్థ్యం) సుస్థిర ఏవియేషన్‌ ఫ్యూయల్‌ ప్లాంట్‌తో కూడిన 2జీ బయోరిఫైనరీని రూ. 10 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రూ. 54 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో ఆ సంస్థ వెల్లడించింది. 2 గిగావాట్ల ఆర్‌ఈ-ఆర్‌టీసీ (రీ-ట్రాన్షిషన్‌ కెపాసిటీ) ఎనర్జీతో నడిచే అల్యూమినియం ప్లాంట్‌ను కాకినాడలో, 30 వేల కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరే బయో రిఫైనరీ ప్లాంట్‌లను శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 04:13 AM