సదావకాశం..
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:56 PM
గతంలో గృహ విద్యుత వినియోగవారులు ఎవరైనా సాధారణం కంటే అదనంగా వాడితే..
అదనపు లోడు క్రమబద్ధీకరణకు గడువు పెంపు
డిసెంబరు ఆఖరి వరకు చాన్స
ఆర్థిక భారం తగ్గించే దిశగా చర్యలు
అధికలోడు కింద 10,022 కేసులు నమోదు
జిల్లాలో ఇప్పటివరకు 5255 దరఖాస్తులు
రూ.69.55లక్షల ఆదాయం
ప్రస్తుతం ఉన్నవాటిలో 50శాతం రాయితీ
అవగాహన కల్పిస్తున్న విద్యుత శాఖాధికారులు
గతంలో గృహ విద్యుత వినియోగవారులు ఎవరైనా సాధారణం కంటే అదనంగా వాడితే.. బిల్లుల మోత మోగేదీ. పేద, మధ్య తరగతి ప్రజలకు తెలియకుండానే ఆర్థిక భారం పడేది. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అదనపులోడు క్రమబద్ధీక రణకు శ్రీకారం చుట్టింది. మార్చి నుంచి జూన వరకు అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో డిసెంబర్ ఆఖరి వరకు గడుపు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలోని నంద్యాల, డోన, ఆత్మకూరు డివిజన పరిధిలో 5,84,839 గృహ విద్యుత కనెక్షన్లు ఉన్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అధిక లోడు కింద 10,022 కేసులు నమోదు చేసి రూ.3.75కోట్లు అధికారులు వసూలు చేశారు. అధిక లోడు క్రమబద్ధీకరణకు 5255మంది వినియోగదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరూ చెల్లించిన ఫీజుల పరంగా విద్యుతశాఖకు రూ.69.55లక్షల ఆదాయం సమకూరినట్లైంది.
నంద్యాల, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): విద్యుత వినియోగదారుల అదనపు లోడు క్రమబద్ధీకరణకు గడువు పెంచుతూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన వరకు అవకాశం కల్పించింది. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో వినియోగదారుల అభిప్రాయం మేరకు విద్యుతశాఖ అధికారులు గడువు పెంచాలని నివేదిక అందజేశారు. ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది డిసెంబరు ఆఖరి వరకు గడువు పెంచుతూ అనుమతించింది. దీంతో రోజురోజుకు ఆయా వర్గాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఇదే క్రమంలో విద్యుతశాఖ అధికారులు సైతం అవగాహన కల్పించడం జరుగుతోంది. ఏదిఏమైనా అదనపులోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోమారు గడువు పెంచడంతో ఆయా వర్గాల్లో ఆర్థిక భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నట్లైంది.
--------------------------------------------------------------------------
అదనపులోడు సాధారణంగా చెల్లించాల్సిన రాయితీతో చెల్లించాల్సిన
----------------------------------------------------------------------
1 రూ. 2,250 రూ.1,250
2 రూ. 4,450 రూ. 2.450
3 రూ.6,650 రూ. 3,650
-------------------------------------------------------------------
అధిక శాతం అనుమతి తీసుకున్న..
జిల్లాలోని నంద్యాల, డోన, ఆత్మకూరు డివిజన పరిధిలో 5,84,839 గృహ విద్యుత కనెక్షన్లు ఉన్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ఇందులో అధిక శాతం అనుమతి తీసుకున్న కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత వినియోగిస్తున్నట్లు ఆశాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం. జిల్లాలో ఇప్పటి వరకు అధిక లోడు కింద 10,022 కేసులు నమోదు చేసి రూ.3.75కోట్లు వసూలు చేయడమే. చాలామంది వినియోగదారులు తెలియకనే అధిక విద్యుత వినియోగించడం విద్యుత బిల్లుల మోత మోగి ఆర్థికంగా చితికిపోతున్నారని తెలుస్తోంది.
తక్కువ లోడు తీసుకుని..
సాధారణంగా ఎవరైనా విద్యుత కనెక్షన తీసుకునే సమయంలో తక్కువ లోడు తీసుకుని.. ఆతర్వాత వినియోగం పెరిగిన అదేలోడుతో వినియోగిస్తుంటారు. వారి తెలియక వా డేస్తుంటారు. ఈవిషయం అధికారుల తనిఖీలతో బట్టబయలవుతోంది. అధికలోడు క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం డిసెంబరు ఆఖరి వరకు గడువు పెంచింది. దీంతో ఆయా క్యాట గిరిలకు చెందిన వినియోగదారులు ప్రతిఅదనపు కిలో వాట్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 200, డెవలప్‌మెంట్ చార్జి రాయితీతో రూ.1000, దరఖాస్తు ఫీజు రూ. 50 చెల్లించాలి. ఈ లెక్కన ఎన్ని కిలోవాట్లు వరకు లోడు పెరిగితే.. దరఖాస్తు ఫీజు మినహా మిగిలిన రెండు చార్జీలు రెట్టింపు చెల్లించాల్సి ఉంది. డెవలప్‌మెంట్ చార్జిలో 50శాతం రాయితీ కల్పించింది.
భవిష్యత్తులో రెట్టింపు..
అదనపులోడు క్రమబద్ధీకరణ కింద జిల్లాలోని 5255మంది వినియోగదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరూ చెల్లించిన ఫీజుల పరంగా విద్యుతశాఖకు రూ.69.55 లక్షల ఆదాయం సమకూరినట్లైంది. భవిష్యతలో రెట్టింపు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. ఏకంగా ప్రస్తుతం ఉన్న వాటిలో 50శాతం రాయితీ కల్పించడంతో ఆయా వర్గాలకు ఎంతో దోహదపడినట్లైంది.
సద్వినియోగం చేసుకోకపోతే..
అదనపులోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యతులో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డిసెంబరు గడువు ముగిసిన తరువాత కూడా అధికలోడు వినియోగించడం అధికారులు గుర్తిసే.. కేసులు నమోదు చేసి జరిమానాల రూపంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది.
వినియోగదారులు ఈ అవకాశాన్ని..
అదనపులోడు క్రమబద్ధీకరణకు డిసెంబరు వరకు ప్రభుత్వం గడువు కల్పించడం శుభ పరిణామం. ఇది అదనపులోడు వినియోగదారులకు మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- సుధాకర్‌కుమార్, ఎస్‌ఈ, నంద్యాల