నిధులు కేటాయించండి
ABN , Publish Date - May 12 , 2025 | 11:33 PM
నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను నంద్యాల ఎంపీ డా.భైరెడ్డి శబరి కోరారు.
మంత్రి నారాయణను కోరిన ఎంపీ డా.భైరెడ్డి శబరి
నందికొట్కూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను నంద్యాల ఎంపీ డా.భైరెడ్డి శబరి కోరారు. సోమవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణను నంద్యాల ఎంపీ, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన డి.సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన నందికొట్కూరు మున్సిపాలిటీలో నిధుల కొరతతో అభివృద్ధి కుంటు పడిందని మంత్రికు మున్సిపల్ చైర్మన తెలిపారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారాయణ ఎంపీకి హామీ ఇచ్చారు.