Yadava Corporation Chairman: సాక్ష్యాలను తారుమారు చేసేందుకే సతీశ్ హత్య
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:10 AM
సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్‌ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారని యాదవ కార్పొరేషన్ చైర్మన్...
యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్‌ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో సాక్ష్యులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణి కేసులోనూ ఒక్కొక్కరిని హతమారుస్తున్నారు. నాడు బాబాయ్‌ని హత్య చేసి బాత్రూంలో పడేశారు. నేడు సతీశ్‌కుమార్‌ని హత్య చేసి రైలు పట్టాల పక్కన పడేశారు. వివేకా హత్య, పరిటాల హత్య, పరకామణి సతీశ్ హత్య... ఇలా అన్ని నేరాలకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. పరకామణి ఉదంతం, అనంతర పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలి’ అని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.