కార్మికులందరూ సహనంతో ఉండాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:57 PM
విజయ డెయి రీ కార్మికులందరూ సహనంతో ఉండాలని, త్వరలోనే సమస్యలు ప రిష్కరిస్తామని టీడీపీ యువనాయకుడు భూమా జగత విఖ్యాత రెడ్డి అన్నారు.
టీడీపీ యువనాయకుడు భూమా జగత విఖ్యాత రెడ్డి
కార్మికుల సమ్మెకు మద్దతు
నంద్యాల రూరల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయ డెయి రీ కార్మికులందరూ సహనంతో ఉండాలని, త్వరలోనే సమస్యలు ప రిష్కరిస్తామని టీడీపీ యువనాయకుడు భూమా జగత విఖ్యాత రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక విజయ డెయిరీ వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగత మా ట్లాడుతూ త్వరలో కొత్త బోర్డు ఏర్పడనున్నట్లు అన్ని సమస్యలు ప రి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల పట్ల కక్ష సాధింపు ధోరణి వీ డకపోతే మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికైనా విజయ డె యిరీ సంక్షేమం కోరే వారందరు ఏకం కావాలన్నారు. అనంతరం టీ ఎనటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ , కోశాధి కారి నాగసతీశ మాట్లాడుతూ.. అనంతపురం సత్యసాయి జిల్లాలకు చెందిన పాడి రైతుల బోనస్ సైతం చైర్మన వారికి ఎక్కడా ఒక్క పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. చైర్మన కొన్ని టన్నుల పాలపోడి, వెన్న సైతం చైర్మన అమ్ముకున్నారని, వాటికి ఎలాంటి లెక్కలు లేవని అన్నారు. గ్రాట్యూటీ రూ.20 లక్షలు రికార్డుల్లో చూ పిస్తూ రూ.10 లక్షలు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, లింగన్న పాల్గొన్నారు.