CM Chandrababu: సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:18 AM
వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌పై సోమవారం సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తస్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలందిస్తున్నాయన్నారు. అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకొని, ప్రజలకు ఆన్‌లైన్‌లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలన్నింటినీ.. కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని పేర్కొన్నారు.