Share News

PG Medical Seats: ఆలిండియా కోటా మెడికల్‌ పీజీ సీటురద్దుకు రేపటి వరకు చాన్స్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:49 AM

ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో మెడికల్‌ పీజీ సీటు పొందిన అభ్యర్థులకు మెడికల్‌ కౌన్సిల్‌ కమిటీ(ఎంసీసీ) మరొక చాన్స్‌ ఇచ్చింది.

PG Medical Seats: ఆలిండియా కోటా మెడికల్‌ పీజీ సీటురద్దుకు రేపటి వరకు చాన్స్‌

  • రాష్ట్రస్థాయిలో సీటు పొందిన కాలేజీలో చేరొచ్చు

  • విద్యార్థులకు అవకాశం కల్పించిన ఎంసీసీ

అమరావతి, డిసెంబరు 8(ఆంధ్ర జ్యోతి): ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో మెడికల్‌ పీజీ సీటు పొందిన అభ్యర్థులకు మెడికల్‌ కౌన్సిల్‌ కమిటీ(ఎంసీసీ) మరొక చాన్స్‌ ఇచ్చింది. రాష్ట్ర కోటాలో సీటు పొందిన అభ్యర్థులు ఆలిండియా కోటా సీటును వదులు కొనేందుకు ఈనెల 10 వరకూ అవకాశం కల్పించింది. 8 సాయంత్రం 4 గంటల నుంచి 10 సాయంత్రం 6 గంటల వరకూ అభ్యర్థులు ఆలిండియా కోటా సీటు పొందిన కాలేజీలకు వెళ్లి, అక్కడ సీటు వదులుకుంటున్నట్లు లేఖ ఇవ్వా లని సృష్టం చేసింది. ఈ మేరకు ఎంసీసీ అత్యవసర నోటీస్‌ జారీచేసింది. రాష్ట్రాలు, సీటు పొందిన అభ్యర్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 120 మంది ఆలిం డియా కోటా కౌన్సెలింగ్‌లో సీటు పొందారు. వారికి కేటాయించిన కాలేజీల్లో చేరిపోయారు. ఆలిండియా కోటా సీటు వదులుకొని, రాష్ట్ర స్థాయిలో సీటు పొందిన కాలేజీల్లో చేరేందుకు తొలుత ఎంసీసీ అనుమతి ఇవ్వలేదు. విద్యార్థులు, అన్ని రాష్ట్రాల వర్సిటీల నుంచి లేఖలు రావడంతో ఎంసీసీ విద్యార్థులకు మరొక అవకాశం ఇచ్చింది.

Updated Date - Dec 09 , 2025 | 04:50 AM